JGL: కథలాపూర్ మండలం దూలూరు గ్రామ శివారులోని వాగులో నుంచి అక్రమంగా ఇసుకను నిజామాబాద్ జిల్లాకు చెందిన టిప్పర్లో తరలిస్తుండగా ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. పోలీస్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా ఇసుక టిప్పర్ కనిపించిందన్నారు. టిప్పర్ను పట్టుకుని డ్రైవర్ నజీర్ పై కేసు నమోదు చేశామన్నారు.