TG: వికారాబాద్ జిల్లా కొడంగల్లో అంగన్వాడీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ జిల్లా నలుమూలల నుంచి 300 మంది అంగన్వాడీ కార్యకర్తలు.. సీఎం నివాసం ముట్టడి కోసం కొడంగల్ వచ్చారు. స్థానిక బస్టాండ్లో నిరసన తెలిపారు. సుమారు 40 మంది సీఎం ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.