వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని సూర్యతండాలో సోమవారం వరంగల్ నుంచి అన్నారం వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసును పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కొత్త బస్సు సర్వీసుతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని స్థానికులు భావిస్తున్నారు.