TPT: రైతులు వరి పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దామోదరం రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మండలంలోని రైతులను కలిసి వరి పంట ధరలపై ఆరా తీశారు. పంటలకు గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి వ్యయం అధికమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.