NGKL: బాల్య వివాహాలకు తావులేదని ఉమ్మడి ఆలయం ప్రధాన పూజారి, MBNR జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడు శ్రీ ఓరుగంటి సంపత్ కుమార్ శర్మ తెలిపారు. సింగపట్నం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, దేవాలయంలో బాల్యవివాహాలకు చోటు ఇవ్వబోమని స్పష్టం చేశారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహాలు జరగవని పేర్కొన్నారు. ఎవరు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.