ప్రకాశం: అర్హులైన పేదలందరికీ ఇంటి నివేశణ స్థలాలను ఇవ్వాలని సీపీఐ కనిగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి పందిటి మోహన్ అన్నారు. సోమవారం అర్హులైన పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కనిగిరి తహసీల్దార్ శంకర్‌కు వినతి పత్రం అందజేశారు .ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని అన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ అందరికీ స్థలాలు వచ్చేలా చూస్తామని పేర్కొన్నారు.