జనగామ కలెక్టరేట్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు.