అన్నమయ్య: టమోటా, బొప్పాయి పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాయచోటి జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం నందు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్, ఏపీ కిసాన్ కాంగ్రెస్ వైస్ ఛైర్మన్ సింగం రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.