E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం ‘స్వస్త్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమం ప్రచార గోడ పత్రికను జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామ మూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న ఈ అభియాన్ శిబిరాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.