కృష్ణా: రాష్ట్రంలో రజక సంఘీయులపై జరుగుతున్న దాడులను అరికడుతూ రజకులకు రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి రజక వృత్తిదారుల సంఘ కార్యదర్శి చిక్ వెంకటరెడ్డయ్య విజ్ఞప్తి చేశారు. గుడివాడ జగన్నాధపురంలోని రజక సంఘం అధ్యక్షుడు శేషుబాబు స్వగృహంలో సంఘీయులపై జరుగుతున్న దాడులను సంఘ పెద్దలు సోమవారం ఖండించారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.