HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కాజీపేట సర్కిల్ కార్యాలయం ఎదుట సోమవారం వికలాంగుల పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. సర్కిల్ కార్యాలయం గేటు ముందు ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వెంటనే వికలాంగులకు రూ. 6000 పింఛన్ ఇవ్వాలని కోరుతూ సురేందర్ మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.