WGL: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని కలెక్టర్ కార్యాలయ వర్గలు తెలియజేశాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద సంబంధిత అధికారులతో కలిసి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందని, ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు పాల్గొనాలని అధికారులు వెల్లడించారు.