SKLM: పాతపట్నం మండల కేంద్రంలోని శ్రీ నీల మణి దుర్గ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు ఇవాళ ఉదయం 10 గంటలకు జరగనుంది. ఈ విషయాన్ని ఆలయ ఈవో టీ. వాసుదేవరావు ఆదివారం ప్రకటించారు. దేవదాయ శాఖ అధికారులు, భక్తుల సమక్షంలో లెక్కింపు జరగనుందని, ఆసక్తి ఉన్న భక్తులు డ్రస్ కోడ్ పాటించి పాల్గొన వచ్చని తెలిపారు.