VZM: రాజాం పట్డణం కొండ పేటలో వైసీపీ ఇంఛార్జ్ తలే రాజేష్ ఆద్వర్యంలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు తెలిపారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛను అమలు చేయాలని డిమాండ్ చేశారు.