SRCL: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామానికి చెందిన మిడిదొడ్డి స్వాతిక ఐదవ తరగతి చదువుతుంది. ఆరు నెలల క్రితం వెన్నుపూస సమస్యతో మంచానికి పరిమితమైంది. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆపరేషన్‌కు రూ.4 లక్షల ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారు. దీంతో బోప్పపూర్ పాఠశాల ఉపాధ్యాయులు స్వాతిక సర్జరీ కోసం రూ.1.055 లక్షలను పోగుచేసి వారికి అందజేశారు.