ATP: ప్రభుత్వ అభివృద్ధిని చూసి సహించలేక వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం ధర్మవరంలో ఆయన మాట్లాడుతూ.. రోజా మాట తీరు మార్చుకోవాలని, పేర్ని నాని కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తే తగదని హెచ్చరించారు. 11 సీట్లు వచ్చినా బుద్ధిమాలేదని మండిపడ్డారు.