SKLM: పశువులకు వాతావరణ మార్పులు కారణంగా గాలికుంటు వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని ఈ వ్యాధి సోకితే దాని నివారించేందుకు ఎన్నో ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం పోలాకి మండలం కత్తిరవాని పేటలో పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా పశువులకు టీకాలు అందించారు. ప్రభుత్వం వీటిని ఉచితంగానే అందజేస్తుందని తెలిపారు.