ASR: పశు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు మండలం ఎం.మాకవరం గ్రామ సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ చైతన్య రైతులకు సూచించారు. సోమవారం గింజర్తి, చింతలపూడి గ్రామాల్లో పర్యటించారు. ఆవులు, మేకలు పలు పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఇంజక్షన్లు వేసి, మందులు పంపిణీ చేశారు. పశు వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.