TG: మంత్రి పొన్నం ప్రభాకర్ కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి వద్ద మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. మంత్రి పొన్నం సహా అధికారులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.