WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల వారాంత సెలవుల తర్వాత సోమవారం పునఃప్రారంభం కానుంది. శనివారం, ఆదివారం సెలవుల కారణంగా మార్కెట్ బంద్ ఉంది. రేపు ఉదయం 6 గంటల నుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. రైతులు నాణ్యమైన సరుకులను తీసుకొచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. సౌకర్యవంతమైన వ్యాపారం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.