JGL: మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ఒడిగే హారిక (17) ఆదివారం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హారిక ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది. కాగా, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.