ప్రకాశం: చీమకుర్తి పట్టణంలోని ఏకలవ్యనగర్లో 21 మంది లబ్ధిదారులకు రూ.15.34 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఆదివారం ఏమ్మెల్యే విజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.