మేడ్చల్: యూనియన్లతో సమైక్యత సాధ్యమవుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఆదివారం, గాజులరామారం పరిధిలో ఎంప్లాయిస్ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకంగా ఉంటుందని, వారే మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేకమంది కార్మిక నేతలు పాల్గొన్నారు.