TG: జింక మాంసం రవాణాను పోలీసులు గుట్టురట్టు చేశారు. HYD టోలిచౌకిలోని ఓ అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో 10 కిలోల జింక మాంసం, 3 జింక కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సలీం, ఇక్బాల్‌ను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న కారును సీజ్ చేశారు. వారి నుంచి 5 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.