TG: ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఉన్నత విద్యాసంస్థలు రేపటి నుంచి బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి కాలేజీ యాజమాన్యాలను చర్చలకు పిలిచింది. ఇవాళ సాయంత్రం కాలేజీ యాజమాన్యాలతో భేటీ కానుంది. ఈ సమావేశంలో Dy.CM భట్టి విక్రమార్క, కళాశాల యాజమాన్యాలతో చర్చించనున్నారు. కాగా, ఈ చర్చల అనంతరం బంద్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.