ASF: కాగజ్ నగర్ పట్టణంలోని ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19,20,21 తేదీలలో నార్సింగిలో జరగబోయే ఫోటో ఎక్స్పో పోస్టర్లను MLA హరీష్ బాబు ఆవిష్కరించారు. MLA మాట్లాడుతూ.. ఎక్స్పో ద్వారా కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలపై ఫోటోగ్రాఫర్స్ అవగాహన పెంచుకోవచ్చన్నారు. దీని ద్వారా ఫోటోగ్రఫీ రంగానికి మరింత ప్రాధాన్యత లభించాలని కోరారు.