PDPL: 2025-26 ఆర్థిక సంవత్సరానికి RG-3, APA ఏరియాల సింగరేణి సేవా సమితి నిర్వహించనున్న నైపుణ్యాభివృద్ధి కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పర్సనల్ విభాగాధిపతి సుదర్శనం తెలిపారు. టైలరింగ్, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిజైనింగ్, జూట్ బ్యాగ్స్ తయారీ వంటి కోర్సులకు అర్హత ఉన్న సింగరేణి ఉద్యోగుల కుటుంబ మహిళలు, పరిసర గ్రామాల మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.