KRNL: ఆదివారం నిర్వహించిన సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీని ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జిల్లా పోలీసు కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. సైక్లింగ్ తో శారీరక ధృఢత్వం పెరగడమే కాక, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని తెలిపారు.