NLR: కొండాపురం మండలంలోని వెలిగండ్ల వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కావలి నుంచి వెలిగండ్లకు వచ్చి వెళ్తున్న బైకును వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వెనకాలే ఉన్న మహిళకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.