MBNR: ఈనెల 18వ తేదీన జిల్లా ప్రైవేటు పాఠశాలల స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. పట్టణంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్స్ ఉత్తమ ఉపాధ్యాయుల పేర్లు నమోదు చేయించాలన్నారు.