కృష్ణా: ప్రభుత్వం వాహన మిత్ర పథకం కింద అర్హత సాధించిన డ్రైవర్లకు ఏటా రూ.15వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు బాపులపాడు MPDO కే. జోగేశ్వరరావు ప్రకటించారు. ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లు ఈనెల 17 నుంచి గ్రామ సచివాలయాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పరిశీలన అనంతరం ఈనెల 24న అర్హుల జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.