అన్నమయ్య: జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నిశాంత్ కుమార్, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆదివారం ఉదయం రాయచోటి కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉదయం 11:30 గంటలకు బాధ్యతలు స్వీకరించిన ఆయన, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తానని కలెక్టర్ పేరుతున్నారు.