KMM: జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఆదివారం ఖమ్మం SR&BGNR కళాశాలలో ఇట్టి పరీక్షలు చేపట్టినట్లు అన్నారు. ఉదయం సెషన్లో చేపట్టిన థియరీ పరీక్షకు 129 మంది అభ్యర్థులకు గాను 128 మంది, మధ్యాహ్నం నిర్వహించిన ప్లాటింగ్ పరీక్షకు 205 మంది అభ్యర్థులకు గాను 202 మంది హాజరయినట్లు పేర్కొన్నారు.