SDPT: ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో సిద్దిపేటను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పారు. అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, వాటిని ఇతర రాష్ట్రాలు, దేశాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయని అన్నారు. కానీ ప్రస్తుతం సిద్దిపేటలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.