MNCL: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో CPI పార్టీ ప్రముఖ పాత్ర పోషించిందని పట్టణ కార్యదర్శి రాజమౌళి అన్నారు. రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా బెల్లంపల్లి రడగంబాల బస్తీలో ఎర్రజెండా ఆవిష్కరించారు. స్వాతంత్య్రం వచ్చే వరకు CPI అలుపెరుగని పోరాటం చేసిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు.