W.G: మొగల్తూరు నుంచి వెంప వరకు రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం ఆరవ రోజుకు చేరాయి. ఈరోజు దీక్షలో ఐక్యవేదిక సభ్యులు ఎడ్ల చిట్టిబాబు, బంగారు వెంకట సీతారామయ్య, అడ్డాల ఏడుకొండలు, కుందేటి వెంకటేశ్వరరావు, వామిశెట్టి ఏసుబాబులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రహదారి నిర్మించాలని వారు కోరారు.