NLG: ఇంటి స్థలాల కోసం గతంలో కేటాయించిన భూమిని పేదలకు ఇంటి స్థలాలకే ఇవ్వాలని సీపీఐ (ఎం) నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి డిమాండ్ చేశారు. నాంపల్లి మండలం గట్లమల్లేపల్లిలో 25 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఇంటి స్థలాల కోసం కేటాయించిన భూమిని వేరే అవసరాలకు మళ్లించకుండా, కేవలం నివాసాల కోసమే ఉపయోగించాలని ఆయన కోరారు.