KNR: కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆదివారం గన్నేరువరం మండలంలోని మైలారం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షణ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు వరాల పరుశరాములు, విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, కమిటీ సభ్యులు, వైస్ చైర్మన్ నూకల తిరుపతి, జక్కన్న పెళ్లి సత్తయ్య, ఇతర సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.