SKLM: శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.