HYD: ఈ ఏడాది అక్టోబర్ నెలలో HYD ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో మెగా క్రికెట్ ఈవెంట్ జరగనుంది. దీనికి సంబంధించి ఎలైట్ క్రికెట్ బ్రోచర్, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ క్రికెట్ ఈవెంట్లో సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, పోలీస్ అధికారులు, బుల్లితెర నటులు, మీడియా ప్రతినిధులు పాల్గొంటారన్నారు.