PDPL: రామగిరి మండలం పన్నూరులో దారుణం చోటుచేసుకుంది. వకీల్ పల్లె ప్లాట్స్లోని సీసీరోడ్డులో రమాదేవి అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం మృతురాలు భర్త కృపాకర్కు కొంతకాలంగా దూరంగా ఉంటుంది. ఇటీవల అత్తింటికి వెళ్లి వారితో గొడవ పడింది. అత్తింటివారే ఆమెను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.