AP: దావోస్, ఫ్రాంక్ఫర్ట్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. దావోస్లో గ్లోబల్ ఎస్ఎంఈ సదస్సు, జర్మనీ ఫ్రాంక్ఫర్ట్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి వివరించామని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి పాలసీలపై పెట్టుబడిదారుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని వెల్లడించారు.