VKB: ఆదివారం సెలవు దినం కావడంతో కోట్పల్లి ప్రాజెక్టుకు పర్యాలకుల సందడి పెరిగింది. హైదరాబాద్, కర్ణాటక, సంగారెడ్డి, సుదూర ప్రాంతాలనుంచి సందర్శకులు వచ్చారు. పెద్దలు, చిన్నపిల్లలు, వృద్ధులు, యువతి, యువకులు ప్రకృతి అందాలను తిలకిస్తూ బోటింగ్ చేశారు. నీళ్లలో తడుస్తూ ఎంజాయ్ చేసిన వారు చెట్ల కింద వంటలు వండుకుని వనభోజనాలు చేశారు. అనంతరం తిరిగి వారి వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.