HYD: బాగ్లింగంపల్లి సుందరయ్య కళా నిలయంలో శిల్పాఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో జాతీయ శిల్పా ఐకాన్ అవార్డ్స్ – 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిల్పకళలు మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అన్నారు. తెలంగాణ యువతలో సృజనాత్మకత, ఆవిష్కరణలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు.