ATP: జిల్లాలో మూడ్రోజులుగా వర్షాలు కురుస్తుండగా సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 110.9 మిల్లీమీటర్లు కాగా ఈనెల 14వ తేదీ వరకు 60.9 మిల్లీమీటర్లు నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం ఎనిమిది మండలాల్లో వర్షాలు పడగా బుక్కరాయ సముద్రంలో 24.2 మిల్లీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదై ఇతర మండలాల్లో కూడా తగిన వర్షపాతం నమోదైంది.