HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అభివృద్ధి చేస్తున్న HYD గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్ – బెంగుళూరుకు హై స్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై రైల్వే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బుల్లెట్ రైలు సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలన్నారు.