ప్రకాశం: రాష్ట్రంలో రాబోయే 4 రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు సంభవించనున్నాయి.