AP: ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘సజీవ చరిత్ర’ పుస్తకాన్ని విజయవాడలో రేపు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరవుతారని కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ తెలిపారు. విక్రమ్ పూల రచించిన ఈ పుస్తకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిణామాలు, NTR మళ్లీ CM అయిన తీరుతెన్నులను వివరించినట్లు చెప్పారు.