అన్నమయ్య: సీఎం సహాయనిది పేదలకు ఓ వరం లాంటిదని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. ఆదివారం ఓబులవారిపల్లి మండలం బోటిమీదపల్లి గ్రామానికి చెందిన కొప్పల చరణ్ తేజకు CM సహాయ నిధి ద్వారా రూ. 36,739 చెక్కును అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎన్నో కుటుంబాలకు సహాయం అందుతోందని ఎమ్మెల్యే తెలిపారు.