వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం చివరలో ఉన్న గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణానికి అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఒక్కో ఎకరాకు రూ.12.60 లక్షలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ సందర్భంలో రైతులంతా కూడా తమ భూములను ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.